Telangana Police Notification 2026: ఖాకీ చొక్కా వేసుకోవడమే లక్ష్యంగా ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TGPRB) త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అర్హతలు ఏంటి? అనే పూర్తి వివరాలు చూద్దాం.
Telangana Police Notification: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ఖాళీల వివరాలు (Vacancy Details)
మొదట కేవలం 5,000 పోస్టుల భర్తీకే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం అదనంగా మరో 2,437 పోస్టులను కలిపి మొత్తం 7,437 పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అనుమతి ఇచ్చింది.
పోలీస్ శాఖ (Police Department) – 5,000 పోస్టులు
పోలీస్ శాఖలో సివిల్, ఏఆర్, టీజీఎస్పీ విభాగాల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు కింది విధంగా ఉన్నాయి:
పోలీస్ కానిస్టేబుల్ (Civil PC): 3,697 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ (AR PC): 1,052 పోస్టులు
సబ్ ఇన్స్పెక్టర్ (Civil SI): 148 పోస్టులు
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (FPB ASI): 23 పోస్టులు
రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (AR SI): 14 పోస్టులు
రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (TGSP SI): 12 పోస్టులు
ఇతర పోస్టులు (SAR CPL, PTO డ్రైవర్, మెకానిక్): 54 పోస్టులు
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) – 1,424 పోస్టులు
ఎస్ఐ (SPF SI): 44 పోస్టులు
కానిస్టేబుల్ (SPF Constable): 1,380 పోస్టులు
ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ (Fire Department) – 790 పోస్టులు
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (SFO): 39 పోస్టులు
ఫైర్ ఫైటర్ (Fire Fighter): 751 పోస్టులు
జైళ్ల శాఖ (Prisons Department) – 223 పోస్టులు
డిప్యూటీ జైలర్ (పురుషులు/మహిళలు): 15 పోస్టులు
వార్డర్ (పురుషులు/మహిళలు): 208 పోస్టులు
Telangana Police Notification: అర్హతలు మరియు ఎంపిక ప్రక్రియ (Eligibility & Selection Process)
TGPRB నుంచి రాబోయే పూర్తి స్థాయి నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు ఉండనున్నాయి. సాధారణంగా ఉండే నిబంధనలు ఇవే:
విద్యార్హత (Education Qualification):
కానిస్టేబుల్/ఫైర్‌మెన్/వార్డర్ పోస్టులకు ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలి.
సబ్ ఇన్స్పెక్టర్ (SI) / డిప్యూటీ జైలర్ పోస్టులకు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి (Age Limit): ప్రభుత్వం వయోపరిమితి సడలింపు (Age Relaxation) ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారిక నోటిఫికేషన్లో స్పష్టత రానుంది.
ఎంపిక విధానం (Selection Process):
ప్రిలిమినరీ రాత పరీక్ష (Preliminary Written Test)
దేహదారుఢ్య పరీక్షలు (Physical Efficiency Test – PET & PMT)
మెయిన్స్ రాత పరీక్ష (Final Written Examination)
నిరుద్యోగులకు అలర్ట్:
లోకల్ క్యాడర్ వారీగా పోస్టుల విభజన, రోస్టర్ పాయింట్ల ఆధారంగా TGPRB త్వరలోనే అప్లికేషన్ లింక్‌ను ఓపెన్ చేయనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగకుండా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రాక్టీస్, సిలబస్ ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది.
తెలంగాణ పోలీస్ ఈవెంట్స్ & ఎగ్జామ్ ప్యాటర్న్ (Selection Details)
పోలీస్ ఉద్యోగాల్లో విజయం సాధించాలంటే రాత పరీక్షలతో పాటు శారీరక దారుఢ్య పరీక్షలు (Physical Tests) కూడా అంతే ముఖ్యం. వాటి ప్రాథమిక వివరాలు ఇవే:
ప్రిలిమ్స్ ఎగ్జామ్ (Preliminary Written Test)
ఎస్ఐ మరియు కానిస్టేబుల్ రెండు పోస్టులకూ మొదట ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది.
ఇది మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్ (MCQs) విధానంలో ఉంటుంది.
ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులను తదుపరి దశ అయిన ఫిజికల్ ఈవెంట్స్‌కు ఎంపిక చేస్తారు.
దేహదారుఢ్య పరీక్షలు (Physical Efficiency Test – PET)
తెలంగాణ పోలీస్ ఈవెంట్స్‌లో కింది విభాగాలు ఉంటాయి:
పురుషులకు (Men): 1600 మీటర్ల పరుగు పందెం (1600 Meters Run)
మహిళలకు (Women): 800 మీటర్ల పరుగు పందెం (800 Meters Run)
వీటితో పాటు లాంగ్ జంప్ (Long Jump) మరియు షాట్‌పుట్ (Shot put) ఈవెంట్స్ ఉంటాయి. சிవిల్ పోస్టులకు పరుగు పందెం కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, కానీ ఏఆర్ (AR), టీజీఎస్పీ (TGSP) పోస్టులకు ఈవెంట్స్ మార్కులు మెరిట్లో చాలా కీలకం.
మెయిన్స్ ఎగ్జామ్ (Final Written Examination)
కానిస్టేబుల్ పోస్టులకు: ఒకే ఒక పేపర్ (200 మార్కులు) ఉంటుంది.
సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టులకు: మొత్తం 4 పేపర్లు ఉంటాయి. (అర్థమెటిక్ & రీజనింగ్, జనరల్ స్టడీస్, అలాగే క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ మరియు తెలుగు/ఉర్దూ పేపర్లు).
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ఎలా? – పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్
తెలంగాణ పోలీస్ నియామక బోర్డు (TGSLPRB/TGPRB) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ సమయంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరియు అవసరమైన పత్రాలను సరైన విధంగా నమోదు చేయడం చాలా ముఖ్యం. చిన్న పొరపాటు కూడా దరఖాస్తు తిరస్కరణకు కారణం కావచ్చు. కాబట్టి కింది స్టెప్స్‌ను జాగ్రత్తగా అనుసరించండి.
స్టెప్–1: అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
ముందుగా తెలంగాణ పోలీస్ నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను tgprb.in ఓపెన్ చేయండి.
నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హోమ్‌పేజీలో కనిపించే “Apply Online” లేదా “New Registration” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్–2: కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి
రిజిస్ట్రేషన్ కోసం ఈ వివరాలు నమోదు చేయాలి.
- మొబైల్ నంబర్
- ఈమెయిల్ ఐడీ (ఉంటే)
- పుట్టిన తేదీ
- ఇతర అవసరమైన వివరాలు
రిజిస్ట్రేషన్ విజయవంతమైన తర్వాత లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ పొందుతారు.
స్టెప్–3: దరఖాస్తు రుసుము చెల్లించండి
రిజిస్ట్రేషన్ అనంతరం మీ కేటగిరీకి అనుగుణంగా నిర్ణయించిన దరఖాస్తు రుసుమును ఆన్లైన్లో చెల్లించాలి.
చెల్లింపు కోసం సాధారణంగా అందుబాటులో ఉండే విధానాలు:
- డెబిట్ కార్డు
- క్రెడిట్ కార్డు
- నెట్ బ్యాంకింగ్
- UPI
ఫీజు విజయవంతంగా చెల్లించిన తర్వాత మాత్రమే తదుపరి దశకు వెళ్లవచ్చు.
స్టెప్–4: ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ పూర్తి చేయండి
లాగిన్ అయిన తర్వాత దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన వివరాలను నమోదు చేయాలి.
వాటిలో ముఖ్యమైనవి:
- అభ్యర్థి వ్యక్తిగత వివరాలు
- తండ్రి / తల్లి పేరు
- చిరునామా
- విద్యార్హతలు
- స్థానిక అభ్యర్థి (Local Candidate) వివరాలు
- కేటగిరీ వివరాలు
అన్ని వివరాలను సంబంధిత సర్టిఫికెట్లలో ఉన్నట్లుగానే నమోదు చేయాలి.
స్టెప్–5: అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి
దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలను నిర్ణయించిన ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
అవసరమైన పత్రాలు
| పత్రం | అవసరం |
|---|---|
| పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో | తప్పనిసరి |
| అభ్యర్థి సంతకం | తప్పనిసరి |
| 10వ తరగతి మెమో | వయస్సు నిర్ధారణ కోసం |
| ఇంటర్ / డిగ్రీ సర్టిఫికేట్ | పోస్టును బట్టి |
| కుల ధృవీకరణ పత్రం | వర్తించే వారికి |
| EWS సర్టిఫికేట్ | వర్తించే వారికి |
| స్టడీ సర్టిఫికెట్లు | స్థానిక అభ్యర్థి నిర్ధారణ కోసం |
స్టెప్–6: వివరాలను పరిశీలించండి
దరఖాస్తును సమర్పించే ముందు Preview ఆప్షన్ ద్వారా నమోదు చేసిన ప్రతి వివరాన్ని మరోసారి పరిశీలించండి.
ప్రత్యేకంగా ఈ వివరాలు తప్పకుండా సరిచూడండి.
- పేరు
- పుట్టిన తేదీ
- ఆధార్ వివరాలు (అడిగితే)
- కేటగిరీ
- స్థానిక జిల్లా
- విద్యార్హతలు
స్టెప్–7: దరఖాస్తును సమర్పించండి
అన్ని వివరాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత Submit బటన్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తు విజయవంతంగా సమర్పించిన తర్వాత Application PDF / Acknowledgement ను డౌన్లోడ్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
అభ్యర్థులు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- దరఖాస్తు సమర్పించే ముందు అన్ని వివరాలను రెండుసార్లు పరిశీలించండి.
- పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ వంటి వివరాలను సర్టిఫికెట్లలో ఉన్నట్లుగానే నమోదు చేయండి.
- మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి.
- అవసరమైన పత్రాలను స్పష్టంగా స్కాన్ చేసి మాత్రమే అప్లోడ్ చేయండి.
- చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.
ప్రిపరేషన్ టిప్స్ (How to Prepare?)
పాత ప్రశ్న పత్రాలు (Previous Papers): గతంలో జరిగిన రిక్రూట్మెంట్ పరీక్షల ప్రశ్న పత్రాలను విశ్లేషించడం ద్వారా ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవచ్చు.
సిలబస్ ముఖ్యం: తెలంగాణ ఉద్యమ చరిత్ర, అర్థమెటిక్ & రీజనింగ్, కరెంట్ అఫైర్స్ విభాగాల నుండి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టండి.
గ్రౌండ్ ప్రాక్టీస్: రాత పరీక్షలతో పాటు రోజు ఉదయం లేదా సాయంత్రం ఫిజికల్ ఈవెంట్స్ కోసం గ్రౌండ్ ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి.
టైమ్ టేబుల్ అండ్ డైలీ షెడ్యూల్ (Create a Realistic Timetable)
నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం అనుకోకుండా ఇప్పటి నుంచే రోజుకు కనీసం 6 నుండి 8 గంటలు చదవడానికి కేటాయించండి.
ఉదయం పూట మైండ్ ఫ్రెష్‌గా ఉన్నప్పుడు జీఎస్ (General Studies) లేదా కరెంట్ అఫైర్స్ చదవండి.
మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో కనీసం 2 గంటలు అర్థమెటిక్, రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి (ఇది కేవలం చదివితే రాదు, పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేయాలి).
రాత్రి పడుకునే ముందు ఆ రోజు చదివిన అంశాలను ఒకసారి క్విక్ రివిజన్ చేయండి.
రాత పరీక్షతో పాటు గ్రౌండ్ ప్రాక్టీస్ (Don’t Ignore Physical Events)
చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ప్రిలిమ్స్ పాస్ అయ్యాక గ్రౌండ్ ప్రాక్టీస్ మొదలుపెడతారు. కానీ 1600 మీటర్ల (పురుషులకు) లేదా 800 మీటర్ల (మహిళలకు) పరుగు పందెం అనేది ఒక్క నెలలో వచ్చేది కాదు.
డైలీ రొటీన్: రోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం 1 నుండి 1.5 గంటలు గ్రౌండ్లో గడపండి.
మొదట్లోనే ఎక్కువగా పరిగెత్తకుండా, బాడీ స్టామినా పెంచుకోవడానికి రన్నింగ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు చేయండి.
ముఖ్యంగా ఏఆర్ (AR) మరియు టీజీఎస్పీ (TGSP) పోస్టులకు ఈవెంట్స్ మార్కులే జీవితాన్ని డిసైడ్ చేస్తాయి (మెరిట్ స్కోర్ ముఖ్యం).
ప్రామాణిక పుస్తకాల ఎంపిక (Follow Standard Books)
మార్కెట్లో దొరికే ప్రతి బుక్ కొనకుండా, అథెంటిక్ పుస్తకాలను ఎంచుకోండి.
తెలంగాణ హిస్టరీ మరియు మూవ్‌మెంట్‌కు తెలుగు అకాడమీ పుస్తకాలు బెస్ట్.
అర్థమెటిక్, రీజనింగ్ కోసం ఆర్ ఎస్ అగర్వాల్ (R.S. Aggarwal) లేదా ఏదైనా నమ్మకమైన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అవ్వండి.
గత వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కోసం డైలీ న్యూస్ పేపర్ (ఈనాడు/సాక్షి/నమస్తే తెలంగాణ) ఫాలో అవుతూ సొంతంగా నోట్స్ రాసుకోండి.
ప్రీవియస్ పేపర్స్ & మాక్ టెస్ట్‌లు (Previous Papers & Mock Tests)
గత ప్రశ్న పత్రాలు: కనీసం గత రెండు రిక్రూట్మెంట్ల (2018, 2022) క్వశ్చన్ పేపర్లను దగ్గర పెట్టుకుని సాల్వ్ చేయండి. దీనివల్ల బోర్డు ప్రశ్నలను ఎలా అడుగుతుందో (Question Trend) ఒక ఐడియా వస్తుంది.
ఆన్లైన్/ఆఫ్‌లైన్ మాక్ టెస్టులు: వారానికి కనీసం ఒక గ్రాండ్ టెస్ట్ రాయండి. పరీక్ష రాశాక ఎక్కడ తప్పులు పోతున్నాయో అనాలసిస్ (Analysis) చేసుకుని, ఆ టాపిక్స్‌ను మళ్లీ చదవండి.
విజేతల రహస్యం (Success Mantra):
పోలీస్ రిక్రూట్మెంట్లో నెగ్గాలంటే “స్థిరత్వం (Consistency)” చాలా ముఖ్యం. రోజుకు 12 గంటలు చదివి, తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇవ్వడం కంటే.. రోజుకు 6 గంటలైనా క్రమం తప్పకుండా నోటిఫికేషన్ వచ్చేంత వరకు, ఎగ్జామ్ జరిగేంత వరకు చదవడం మరియు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయడమే మిమ్మల్ని రేసులో ముందుంచుతుంది.
